Home » CBI
‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాషా’లోని ఓ ఫేమస్ డైలాగ్. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.
ప్రతిపక్షాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒంటికాలిపై లేశారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ మృతి అంశాన్ని రాజకీయం చేయడంపై ధ్వజమెత్తారు. సీపీఎం, బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌లా మారుస్తారా ఏంటీ అని విరుచుకుపడ్డారు. నేను మీకో విషయం చెప్పదలుచుకున్నాను.. అధికారం కోసం నాకు అత్యాశ ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పారు.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ తప్పుకున్నారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్(ED) దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ట్రైయినీ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని డాక్టర్ సుభర్ణ గోస్వామి వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సుభర్ణ గోస్వామి మాట్లాడారు. ఆమె శరీరంలో 151 గ్రాముల ద్రవ పదార్థం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడికి పాల్పడితే.. అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ కోల్‌కతా(Kolkata)లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్‌కతా చేరుకుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.
ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.
రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ఇష్యూతో మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. ఒక్కో కోచింగ్ సెంటర్‌ను పరిశీలిస్తున్నారు. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణాలు, సరైన అనుమతుల గురించి నిశీతంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కిన కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.