Home » Central Govt
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై అమల్లో ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ను శనివారం విధించింది.
పల్లెలను పురోగతి బాట పట్టించే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై దిశానిర్దేశం చేసేందుకు అక్టోబరు 2న ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనుంది.
ఏపీలో 13 జిల్లాల్లో వైసీపీ నేతలకు నచ్చిన వారికి ఇసుక రీచ్లు కట్టబెట్టి దోపిడీ చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుందని.. వారి కోసం కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నేతలు కలిసి నడవాలని దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
Telangana: 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో "క్రాఫ్ట్స్" కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్ ఎంపిక కాగా.. "స్పిరిచ్యువల్ - వెల్నెస్ " కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామం ఎంపికైంది.
పండుగలకు ముందే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని(Minimum Wages) పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మేరకు పెంచారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికులు ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కనీస వేతన రేట్లను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది.
సరైన బోధన, ఇతర సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల నుంచి ఇష్టారీతిన ఎన్రోల్మెంట్ ఫీజును వసూలు చేసిన కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా ఝళిపించింది.
యుద్ధ విమాన పైలట్, 5000 గంటలు విమానాన్ని నడిపిన విశేష అనుభవం కలిగిన ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ను నూతన వైమానిక దళాధిపతిగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలోని ఏడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జులై 11న చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని సవరిస్తూ మంగళవారం సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవడంతో ఈ నియామకాలు జరిగాయి.