Home » Chandra Babu
16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీకి కేంద్ర కేబినెట్లోకి చోటు ఉంటుందా.. లేదా..? ఉంటే ఎవరెవర్ని మంత్రి పదవులు వరించొచ్చు..? అనేదానిపై ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ జరుగుతోంది..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Chandra Babu Naidu in Trending: లోక్సభ ఎన్నికల ఫలితాలు(Lok Sabha Election Results) వచ్చేశాయ్. అయితే, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh New CM) కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu Naidu) వరంలా మారింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. దీంతో న్యూఢిల్లీలోని ప్రదాని మోదీ నివాసంలో బుధవారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పుతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.
లోక్సభ ఎన్నికలు-2024 ఫలితాల్లో బీజేపీకి మ్యాజిగ్ ఫిగర్ దక్కకపోవడంతో మంగళవారం తీవ్ర నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్ నింపారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయేతో కలిసి నిబద్ధతతో పయనిస్తామని, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ ఈ రోజు (బుధవారం) ఉదయం ఆయన చేసిన కీలక వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి.
ఎన్డీఏ సర్కారు మరోసారి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతోంది. దీంతో నరేంద్ర మోదీ(PM Modi Oath Taking Ceremony) మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తినకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఎన్డీఏలో ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా ఢిల్లీ పెద్దలను ఆయన ఆహ్వానించనున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్ని్కల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సునామీల దూసుకెళ్లింది. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి.. మిగిలిన స్థానాలన్నింటినీ కూటమి తన ఖాతాలో వేసుకుంది. చంద్రబాబు నివాసం వద్ద భద్రతను అధికారులు మరింత పెంచారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా కావడంతో నేషనల్ మీడియా సైతం చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
21 రోజులపాటు వేచిచూసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అటు కేంద్రంలో, ఇటు ఏపీలోనూ అధికారాన్ని దక్కించుకుంది. ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే తరువాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నేడు (బుధవారం) ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.