Home » Chandrababu Naidu
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో సీనియర్లు కనిపించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు రోజూ మీడియా ముందు కనిపించే నేతలు.. గత రెండు నెలలుగా ఏమైందో ఏమో గాని ప్రజల్లో కనిపించడంలేదనే టాక్ వినిపిస్తోంది.
జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది.
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఏడు నెలల నుంచి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ వంద రోజుల్లో గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని వినతులు వచ్చినా...
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు ఇంకా పూర్తికాలేదు. కానీ ఐదేళ్ల జగన్ పాలనతో పోల్చినప్పుడు 50 రోజుల్లోనే సీఎంగా చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది.
మూడు దశాబ్ధాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు.. తమ హక్కుల కోసం పోరాటం.. తమ కళ నెరవేరిందనుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు.. వెరసి.. మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. ప్రజల నిర్ణయంతో ఆ పార్టీ అధినేత జగన్తో పాటు నాయకులంతా ఆశ్చర్యపోయారు.
ఆంధ్రప్రదేశ్లో శాంతి, భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా బెడిసికొట్టిందా.. హస్తినలో నిరసనతో ఆయన ఏం సాధించారు.
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.