Home » Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది.
జగన్ ఏలుబడిలో కొన్ని కీలక రంగాల్లో జరిగిన విధ్వంసంపై రూపొందిస్తున్న శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఏడు శ్వేతపత్రాలకు గాను నాలుగింటిని సీఎం చంద్రబాబు ఇప్పటికే విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశాక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు...
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షెడ్యూలు విడుదల చేసింది. అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది.
రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ నిర్వీర్యమైంది.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా?
గత ఐదేళ్లుగా జగన్ సర్కారు అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. జనంపై భారం మోపుతూ.. అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా చేశారు. జగన్ సర్కారు తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా రూ.1,38,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.
జగన్ సర్కారు కాంట్రాక్ట్ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే రూ.1,771 కోట్లతో ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది.