Home » Chennai
ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి ఐడెంటిటీ బయటకు లీక్ కావడాన్ని సీరియస్గా తీసుకున్నధర్మాసనం దీనిపై కూడా సిట్ విచారణ జరపాలని ఆదేశించింది.
కర్ణాటక సంగీత కచేరీలలో పాటిస్తున్న డ్రెస్ కోడ్కు ప్రముఖ గాత్ర విద్వాంసుడు టీఎం కృష్ణ స్వస్తి పలికారు. చెన్నై నగరంలో ప్రతియేటా మార్గశిర మాసంలో సంగీత కచేరీలు నిర్వహించడం ఆనవాయితీ.
అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు, విలువలు, ప్రతిభాపాటవాలతో కూడిన విద్యనందించటంలో సుస్థిరత్వాన్ని కలిగిన విశ్వవిద్యాలయాలలో వేలూరులోని వీఐటీ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ సంపాదించుకుంది.
ఏడాదంతా కష్టపడి పని చేసి సంస్థకు లాభాలు అందించే ఉద్యోగుల శ్రమను కొన్ని సంస్థలు గుర్తిస్తాయి. ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకుని ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేస్తాయి. ఆ మాత్రం గుర్తింపునకే ఉద్యోగులు ఎంతో సంబరపడిపోతారు.
అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ‘108 అంబులెన్స్’(108 Ambulance) సేవలు పరిచయం చేసింది. ప్రస్తుతం రాజధాని నగరం చెన్నైలో 8 నిమిషాలు, ఇతర జిల్లాల్లో 13 నిమిషాల్లో 108 సేవలు పొందే వసతి ఉంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేలా అంబులెన్స్ ఉండే ప్రాంతాన్ని తెలుసుకొనేలా ప్రత్యేక లింక్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
బంగారం స్మగ్లింగ్లో ప్యాసెంజర్కు సహాయపడిన ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది ఒకరిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
తమిళనాడులో దిండుగల్లోని సిటీ ఆస్పత్రిలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ వద్ద ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.
ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
పుత్తూరు నుంచి తమిళనాడులోని అత్తిపట్టు కొత్త రైల్వే మార్గం కోసం భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతిచ్చింది. 88 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములను సేకరించాల్సి వుంది.