Home » Chennai News
అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) స్పష్టం చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం పశ్చిమ దిశగా పయనించి బలపడిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్ తెలిపారు. అయితే గత 24 గంటలుగా అక్కడే స్థిరంగా ఉన్న అల్పపీడనం ప్రస్తుతం తీరం వైపు పయనిస్తోందన్నారు.
అధికార డీఎంకే నేతలు, అమాత్యులు అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) దృష్టిసారించారు. డీఎంకే ఫైల్స్ పేరుతో ఈ అవినీతి చిట్టా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చే ఏడాది డిసెంబర్లో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు హిందూ దేవాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu) పేర్కొన్నారు.
మదురై జిల్లా అరిటాపట్టిలో హిందూస్థాన్ జింక్ సంస్థకు టంగ్స్టన్ మైనింగ్ ప్రాజెక్ట్(Tungsten mining project)కు సంబంధించి ఇచ్చిన లైసెన్స్ రద్దు చేయడంపై కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు.
మదురై జిల్లా మేలూరు సమీపంలో టంగ్స్టన్ ప్రాజెక్టు అమలైతే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోనని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ప్రకటించారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపూరు(Tirupur) జిల్లా అవినాశి యూనియన్ వేలాయుధపాళెయం పంచాయతీ కాశీగౌండంపాళెయం ప్రాంతానికి చెందిన రమేశ్ (48) టూవీలర్, కార్లు కొనుగోలు చేసి విక్రయించడం, ఆస్తులను తనాఖా పెట్టుకుని వడ్డీకి రుణాలిస్తున్నారు.
కోయంబత్తూరులో రుణ బకాయిలు వసూలు చేయడానికి వెళ్ళిన ఫైనాన్స్ సంస్థ ఉద్యోగిపై పెంపుడు కుక్కను ఉసిగొల్పిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ఆ విదేశీ జాతి శునకం ఫైనాన్స్ సంస్థ ఉద్యోగిని 12 చోట్ల కరవటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వెల్లుల్లికి పోటీగా మునక్కాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ‘ఫెంగల్’ తుఫాన్('Fengal' Cyclone) కారణంగా సాగు పనులు స్తంభించడంతో కోయంబేడు మార్కెట్కు కూరగాయల దిగుమతులు తగ్గాయి.
మలేసియా నుంచి విమానంలో అక్రమంగా తరలించిన 5400 నక్షత్ర తాబేళ్ల(Star tortoises)ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. కౌలాలంపూర్ నుంచి ఓ ప్రైవేటు విమానం బుధవారం స్థానిక త్రిశూలం అంతర్జాతీయ విమానాశ్రయానికి(Trishul International Airport) వచ్చింది.