Home » Chennai News
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌కు చేరువగా సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడి తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 9 ఓడరేవుల్లో ఒకటో నెంబర్ సూచిక ఎగురవేశారు.
శివగంగ జిల్లా సింగంపురణి(Singampurani) సమీపంలో కొండ ప్రాంతాల్లో సీతాఫలం విరగ్గాసింది. కానీ, కోతులకు ఆహారం అందించేలా ఈ పండ్ల వేలాన్ని అటవీ శాఖ అధికారులు రద్దు చేశారు. ప్రాణమలై, ఓడువన్పట్టి, మేలవన్నాయిరుప్పు, సెల్లియంపట్టి తదితర కొండ ప్రాంతాల్లో సీతాఫలం చెట్లు అధికంగా ఉన్నాయి.
మెరీనా బీచ్(Marina Beach) సర్వీసు రోడ్డులో గస్తీ తిరుగుతున్న పోలీసులపై పీకలదాకా తాగిన ఓ జంట విరుచుకుపడింది. అర్థరాత్రి పూట ఉండకూడదని, త్వరగా ఇంటికి వెళ్లమంటూ సలహా ఇచ్చిన పుణ్యానికి ఆ జంట పోలీసులను దుర్భాషలాడింది.
బీజేపీ నుంచి వైదొలిగి అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి(Film actress Gautami)కి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పార్టీ ప్రచార విభాగం ఉప కార్యదర్శిగా నియమించారు. పార్టీ మైనార్టీ విభాగం ఉప కార్యదర్శిగా ఫాతిమా అలీ, వ్యవసాయ విభాగం ఉప కార్యదర్శిగా సన్యాసి నియమితులయ్యారు.
దీపావళి(Diwali) పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే వారి కోసం 14,086 బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్(Minister Sivashankar) తెలిపారు. సోమవారం సచివాలయంలో దీపావళికి ప్రత్యేక బస్సులను నడిపే విషయంపై ఆ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. రవాణా శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఫణీందర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా వాణిజ్యనగరమైన కోయంబత్తూరు(Coimbatore)లో చెరువుపై తేలియాడే సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ ఉత్పత్తి చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. నమక్కునామే పథకం కింద రూ.1.45 కోట్లతో జర్మన్‌కు చెందిన సంస్థతో కలిసి కోయంబత్తూరు కార్పొరేషన్ ఈ ప్రాజెక్టు చేపట్టింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(State Deputy Chief Minister Udayanidhi) ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో డ్రెస్ కోడ్ పాటించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ దాఖలైంది.
వేలూరు(Vellore)లో రీల్స్‌పై మోజుతో ఓ యువకుడు ఆడవేషం ధరించి బైకును అత్యంత వేగంగా నడుపుతున్న దృశ్యాలతో ఓ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. ఆ యువకుడు పొడవైన జడ, పూలు పెట్టుకుని వెనుక నుంచి చూస్తే అందమైన యువతిలాగే వేషం ధరించి ఆ బైకును వేలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో నడిపాడు.
నగరంలో, శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం ఆగి మూడు రోజులు దాటినా శివారు ప్రాంతాల్లోని వారంతా ఇంకా జలదిగ్బంధంలో ఉన్నారు. కార్పొరేషన్ అధికారుల సమాచారం మేరకు శివారు ప్రాంతాల్లో సుమారు 500 కుటుంబాలు వాననీటిలోనే కాపురం చేస్తున్నారు.
అన్నాడీఎంకేను ఏదో రూపంలో విచ్ఛిన్నం చేయాలని డీఎంకే, బీజేపీ, శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం కుట్ర పన్నారని, ఇందుకోసం వారంతా శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సినీ నటి, అన్నాడీఎంకే మహిళా నేత గాయత్రి రఘురాం(Gayatri Raghuram) సంచలన వ్యాఖ్యలు చేశారు.