Home » Chennai News
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) దీపావళి సమయంలో తీపి కబురు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఈశా యోగా కేంద్రం వ్యవహారంలో ఇద్దరు మహిళలు అదృశ్యమైన కేసును మూసివేసిన సుప్రీంకోర్టు.. మిగిలిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టవచ్చని పేర్కొంది.
కోయంబత్తూర్ కేసులో యావజ్జీవఖైదీగా పుళల్ కేంద్ర కారాగారంలో ఉన్న వీరభారతి, తనను ముందుగానే విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ వేశారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో రెండో రోజు సముద్రతీరంలో అలలు తీరం వైపు ఎగసిపడ్డాయి. సునామీ తర్వాత ఇక్కడి తీరంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రనీటి మట్టం తగ్గటం, పెరగటం జరుగుతూ ఉంది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన భారీవర్షాలకు రాజధాని నగరం చెన్నై(Chennai) ఇంకా నీటిలోనే నానుతోంది. రెండు రోజుల వర్షానికి నగరంలో 539 ప్రాంతాల్లో వరద నీరు నిలువగా, ఇందులో 436 ప్రాంతాల్లో జీసీసీ సిబ్బంది తొలగించారు.
కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లాలో మంగళవారం రాత్రి సముద్రతీర ప్రాంతాల్లో రాక్షస అలలు ఎగసిపడ్డాయి. పది నుండి 15 అడుగుల ఎత్తున అలలు దూసుకురావటంతో తీర ప్రాంతాల్లోని నివాసాల్లో సముద్రపు నీరు వరదలా ప్రవేశించింది. పలువురు తమ ఇళ్లలోకి సముద్రపు నీరు రాకుండా ఇసుక బస్తాలు పేర్చి రాత్రంతా జాగారం చేశారు.
కున్నూరు - ఊటీ(Kunnur - Ooty) మధ్య పలు చోట్ల రైలు పట్టాలపై మట్టి చరియలు, బండరాళ్లు పడటంతో కొండ రైలు సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు. నీలగిరి జిల్లా కున్నూరు పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈశాన్య రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం తొమ్మిది జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఆకాశానికి చిల్లిపడిందా? వరుణుడు విరామం మరిచాడా?.. అన్నట్లుగా చెన్నై(Chennai)లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం మంగళవారం రాత్రి వరకు పడుతూనే వుండడంతో నగరం జలసంద్రంగా తయారైంది. వీధులన్నీ నదుల్లా, వాడలన్నీ చెరువుల్లా తయారయ్యాయి.
వందే భారత్ రైలు(Vande Bharat Train)లో ఆహారం నాణ్యతా రహితంగా వుందని సీనియర్ నటుడు పార్తీబన్(Senior actor Parthiban) అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక తమకు సరఫరా చేసిన ఆహారం రకాలు నాణ్యంగా లేవని, నిష్ప్రయోజనకరంగా ఉన్నాయంటూ పలువురు ప్రయాణికులు కూడా తన వద్ద మొరపెట్టుకున్నారని ఆయన తెలిపారు.