Home » Chennai
స్థానిక నుంగంబాక్కం(Nungambakkam)లోని వాతావరణ శాఖ కార్యాలయం సోమవారం తన ట్విట్టర్లో నమోదుచేసిన ప్రకారం... వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నందున ఆనకట్టలు, చెరువులు, వాగులు నిండుతున్నాయి.
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3,400 మంది వద్ద రూ.200 కోట్ల మేర మోసానికి పాల్పడిన నలుగురిని పుదుచ్చేరి సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో(india) ఏదో ఒక చోట వరదలు(floods), విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రధాన ఎనిమిది వరదల సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు వ్యాప్తంగా శనివారం ధర్నాలు జరిగాయి. బడ్జెట్లో రాష్ట్రానికంటూ ఎలాంటి కొత్త పథకాల ప్రస్తావనలుగానీ, రెండో దశ మెట్రోరైలు వంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులుగానీ లేకపోవటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఎక్కడికో బయల్దేరాం! దారిలో ఒక ఫ్లై ఓవర్ కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఏమో.. నేరుగా వెళ్లాలని చెబుతుంది. నేరుగా అంటే.. ఫ్లై ఓవర్ ఎక్కాలా? లేక ఫ్లై ఓవర్ పక్కగా కింద నుంచి వెళ్లాలా? అర్థం కాదు.
భోజనం పార్శిల్‌తో పాటు ఊరగాయ ఇవ్వని ఓ హోటల్‌కు వినియోగదారుల ఫోరం రూ.35 వేల జరిమానా విధించింది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్యస్వామి అనే వ్యక్తి ఓ ఆశ్రమానికి అందించేందుకు విల్లుపురంలోని ఓ ప్రముఖ హోటల్లో 25 భోజనాలు కొనుగోలు చేశారు.
రాజకీయాల కంటే పోలీస్ ఉద్యోగమే మేలనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అనే ఆలోచన కూడా వస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(Bharatiya Janata Party state president K. Annamalai) తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఖరీదైన వస్తువులను ఏదో ఒక సందర్భంలో చాలా మంది ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటారు. అలాంటప్పుడు కోపం, ఆందోళన రావడం సహజమే. కానీ ఓ వ్యక్తి చాకచక్యం.. పోయిందనుకున్న ఖరీదైన వస్తువు తిరిగి వచ్చేలా చేసింది.
తాను పదవీ విరమణ చేశానే తప్ప, పెదవి విరమణ చేయలేదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదిన వేడుకలు, 50 ఏళ్లుగా రాజకీయాల్లో రాణించినందుకుగాను చెన్నైలో శనివారం సాయంత్రం ఆయన్ని నగరానికి చెందిన ప్రముఖులు సత్కరించారు.
ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఐఐటీ మద్రాస్ నుండి పీహెచ్డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.