Home » Chess
పిట్ట కొంచెం, కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ప్రతిభను ప్రదర్శించడానికి వయస్సుతో పనిలేదని నిరూపించింది. 5 ఏళ్ల చిన్నారి.10 నిమిషాల్లో 100కు పైగా చెక్‌మెట్‌లతో తనలోని అద్భుతమైన చెస్ ప్రతిభను ప్రదర్శించి వరల్డ్ బుక్ ఆఫ్ లండన్‌లో స్థానం సంపాదించి అందరితో ఔరా అనిపించింది ఈ చిన్నారి.
నార్వేలో 12వ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్(Norway Chess tournament) 2024 జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన గేమ్ మూడో రౌండ్లో భారతీయ కుర్రాడు ఆర్ ప్రజ్ఞానంద(R Praggnanandhaa) అదరకొట్టాడు. క్లాసికల్ రేటింగ్ గేమ్‌లో మొదటిసారిగా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నార్వేకు చెందిన కార్ల్‌సన్‌ను చిత్తుగా ఓడించాడు.
భారత్‌కు చెందిన 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ గుకేశ్(Gukesh) దొమరాజు ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను(FIDE Candidates 2024 title) గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన ఉత్కంఠభరితమైన 14 రౌండ్ల అభ్యర్థుల చెస్(chess) టోర్నమెంట్ ముగింపులో ఈ యువకుడు 14లో 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసి ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన మనుమరాలితో చెస్ ఆడుతున్న ఒక ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.దీనిపై కేరళ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం మరింత రసవత్తరంగా మారింది.
యువ గ్రాండ్ మాస్టర్ 17 ఏళ్ల గుకేష్ చరిత్ర సృష్టించాడు. 37 ఏళ్లుగా భారత్ తరఫున అగ్రస్థానంలో కొనసాగుతున్న విశ్వనాథన్ ఆనంద్‌ను గుకేష్ అధిగమించాడు.
గతవారం చెస్ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తమిళనాడు చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద గురువారం స్వస్థలం చేరుకున్నాడు..
ప్రపంచకప్ చెస్ టోర్నీని ముగించుకుని స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానందకు చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రజ్ఞానంద నేరుగా తన కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లాడు. తమిళనాడుతో పాటు యావత్ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన చేసినందుకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కు అందించి మెమెంటోను బహూకరించారు.
ప్రపంచకప్ చెస్ టోర్నీలో రాణించిన ప్రజ్ఞానందకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అతడి తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని తెలిపారు. పిల్లలకు చెస్‌పై ఆసక్తి పెంచేలా పేరేంట్స్ అందరూ ప్రోత్సహించాలని.. విద్యుత్ వాహనాల మాదిరిగానే ఇది కూడా పిల్లల భవిష్యత్‌కు మంచి పెట్టుబడి అని పేర్కొన్నారు.
చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా మరోసారి వరల్డ్ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచాడు.
చెస్ వరల్డ్ కప్(Chess World Cup)లో భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద(Ramesh Babu Pragnananda) తన జోరు కొనసాగిస్తూ పైనల్‌కు దూసుకుపోయాడు.