Home » Chief Minister
బీజేపీ కీలక నేతల సమావేశంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్షా దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో మహాకూటమి గెలిచిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రి ఆదేశాల మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రికి 'జడ్' కేటగిరి భద్రత వర్తిస్తుంది. జడ్ కేటగిరి భద్రత కింద షిప్టుల వారిగా ఢిల్లీ పోలీసులు 22 మందిని మోహరించారు.
చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆదివారాని(సెప్టెంబరు1)కి 30 ఏళ్లవుతున్నాయని టీడీ పీ నేతలు తెలిపారు.
తన కుమారుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఎట్టకేలకు స్పందించారు. ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిఫార్సులు వస్తున్న మాట వాస్తవమేనని, కానీ అవేవీ ఫలించలేదని సరదాగా వ్యాఖ్యానించారు.
జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది.
అసోం జనాభాలో 40 శాతం మంది ముస్లింలు ఉన్నారని, 2041 నాటికి అసోంలో మెజారిటీ జనాభా ముస్లింలే కానున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ కుండబద్ధలు కొట్టారు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు.
గౌహతి యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన మార్క్షీట్ కుంభకోణం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో కీలక సూత్రదారి కూడా ఉన్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని ఆహ్వానిస్తూ స్థానిక ట్రిప్లికేన్లో నివసిస్తున్న తెలుగు వారు సంబరాలు జరుపుకున్నారు.
ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా కనక వర్దన్ సింహ్ దేవ్, ప్రవటి పరిదా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారంనాడు ప్రకటించింది. దీనికి ముందు శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా మాఝీ ఎన్నికైనట్టు అధిష్ఠానం తరఫున పర్యవేక్షకులుగా హాజరైన కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ ప్రకటించారు.