Home » Chief Minister
ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారంనాడు ప్రకటించింది. దీనికి ముందు శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా మాఝీ ఎన్నికైనట్టు అధిష్ఠానం తరఫున పర్యవేక్షకులుగా హాజరైన కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ ప్రకటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నికల్లో కూటమి భారీ విజయంతో ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మెుదట జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఆరోజున మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో తేదీని మార్చాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) జూన్-09న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే..