Home » Child abuse
తమ స్కూలు అడ్మిషన్లతో కళకళలాడాలని ఆ బడిలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని బలిచ్చారు ఓ ప్రైవేటు పాఠశాల యజమానులు.
చిన్నపిల్లల నీలిచిత్రాలను (చైల్డ్ పోర్న్) చూడడం, డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టాల కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
అసోంలోని నగాన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా ఆందోళనలకు దారితీసింది.
అభం శుభం తెలియని ఓ బాలిక (12)పై కామంతో కన్నుమూసుకుపోయిన ఓ ప్రభుత్వోద్యోగి (58) అత్యాచారానికి ఒడిగట్టాడు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు లైంగిక దాడి చేశాడు.
బాలికల కనీస వివాహ వయసును 9ఏళ్లకు, బాలురకు 15 ఏళ్లకు తగ్గించేందుకు ఇరాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పితృస్వామ్య కట్టుబాట్లతో నిండిన సమాజంలో ఇరాక్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత బిల్లు మహిళల హక్కులను కాలరాస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వరసగా అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అపహరణ కేసులు పెరిగిపోతున్నాయి. పురిటి బిడ్డలను కూడా వదలడం లేదు. ఏదో ఒకటి ఆశ చూపి అభశుభం తెలియని పసివారని ఎత్తుకెళ్లిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి.
హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో అపహరణకు గురైన ఆరేళ్ల చిన్నారిని పోలీసులు 18 గంటల్లోనే రక్షించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్‌ను అరెస్టు చేశారు.
బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తిస్తందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపింది.
బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకుని వివాదంలో చిక్కుకున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద దలైలామాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.