Home » Chittoor
తిరుపతి: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్‌పై హత్యయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపం వరకు సాగింది.
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు.
చిత్తూరు: నగరంలో బజారు నడివీధి గంగమ్మ జాతర మంగళవారం ఉదయం ఘనంగా మొదలైంది. జాతర వేడుకలను వంశపారంపర్య ధర్మకర్త కుటుంబం, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ముసుగు తొలగించి వేడుకలు ప్రారంభించారు.
తిరుపతి: 125 నుంచి 150 స్థానాల్లో కూటమి గెలుస్తుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్‌ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
Andhrapradesh: తిరుపతిలో ఎంతో వైభవంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతరకు నేడు (మంగళవారం) చాటింపు జరుగనుంది. ఏపీలో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి గంగమ్మ జాతరకు ఎంతో విశిష్ట ఉంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి గ్రామదేవత తాతాయ్యగుంట గంగమ్మకు ప్రతీ ఏటా జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ మొదలవక ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఏకంగా టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు వైసీపీ నేతలు. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలోనే.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు.
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ (Ramachandra Yadav)పై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court)లో రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని హైకోర్టులో ఆయన పిటీషన్ వేశారు.