Home » Chittoor
కుప్పం మండలం బైరప్ప కొట్టాలలో భార్యను అతికిరాతకంగా కత్తితో నరికాడు ఓ భర్త. బైరప్ప కొట్టాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె సమీపంలోని తీర్థం గ్రామానికి చెందిన రాజేష్‌కు సుమారు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.
పులిచెర్ల మండలంలో మూడేళ్లుగా పంటలపై గజరాజులు వరుస దాడులు చేస్తున్నాయి.
మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 20-25 తేదీల మధ్య రూ.160 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధుడు,పలమనేరు మాజీ ఎమ్మెల్యే, టీసీ రాజన్ 108వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.
పంచెకట్టులో నిండైన రూపం.. పెదవులపై చెరగని దరహాసం..ఆనందంతో జనాలకు అభివాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. అధినేతకు జేజేలు.. ప్రాంగణమంతా ఈలలు.. మాటమాటకీ పట్టలేని ఆనందంతో గోలగోలలు.. జడత్వాన్ని వదుల్చుకున్న జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబులో ఎన్నడూ లేని పులకింత కనిపించగా.. జనంలో నిస్తేజం పటాపంచలై కేరింతలతో వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఎప్పటిలా కాకుండా, నూతనత్వంతో ఆద్యంతం ఉత్సాహం ఉరకలు వేసేలా విజయవంతంగా సాగి ముగిసింది.
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు మూషిక వాహనంపై విహరించారు.
వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలను తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
పలమనేరు మండలం బయప్పగారిపల్లి పం చాయితీ ఊసరపెంట గ్రామ సమీపంలోని వరి, అరటి తోటలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి.
జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు లాటరీ ప్రక్రియను పూర్తిచేశారు.