Home » Chittoor
Andhrapradesh: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కారణంగా శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం చేపట్టిన మహాశాంతి యాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి అయ్యింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమం నిర్వహించారు.
రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నామని, ముందుగా మహ శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరుగుతుందని, చివరిగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు.
అలిపిరికి చెందిన ఓ మహిళ పనుల నిమిత్తం బెంగళూరులో నివసిస్తోంది. ఎంత కష్టపడైనా తన కుమార్తెను చదివించాలని అనుకుంది. అయితే బెంగళూరులో చదివించే స్తోమత లేక తన అక్క ఇంటి వద్ద ఉంచుతూ చదవిస్తోంది.
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.
తిరుపతి ఆర్డీవో నిషాంత్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో అప్పటి పుత్తూరు తహసీల్దారు పరమేశ్వరస్వామి (ప్రస్తుతం అనంతపురం జిల్లా ఆత్మకూరు తహసీల్దారు), కలెక్టర్ కార్యాలయంలోని సంబంధిత సూపరింటెండెంట్ సురే్షబాబునూ సస్పెండు చేశారు.
వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని, అది అమలు చేయకపోగా.. రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టారని, జైల్లో పెట్టించారని విమర్శించారు. తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 23 కేసులు పెట్టారని, ఫేక్ జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు.
ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య బంగారుపాళ్యం గ్రామానికి చేరుకుంటారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించనున్నారు.
యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన తొలి హామీ నెరవేర్చడానికి యువనేత నారా లోకేశ్ గురువారం రాత్రి 11.20 గంటలకు బంగారుపాళ్యం చేరుకున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.