Home » CM Chandrababu Naidu
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్లోని JRC కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సర్మించుకున్నారు.
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.
స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు.