Home » CM Chandrababu Naidu
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బుధవారం సాయంత్రం అమరావతిలో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు కర్నూల్లోనే ఉంటాయిని మంత్రి టీజీ భరత్ బుధవారం కర్నూలులో స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారన్నారు.
రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. అధికార.. విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల యుద్ధం జరుగుతోంది. వైఎస్సార్ సీసీకి మండలిలో మెజారిటీ సభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు ధీటుగా బదులిస్తున్నారు. దాంతో వైఎస్సార్ సీసీ ఎమ్మెల్సీలు సభలో ఉండలేక వాకౌట్ చేస్తున్నారు.
రాష్ట్రంలో రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడకుండా, నిరంతర ప్రక్రియగా కొనసాగాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. గేమ్ చేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కరువును నివారించవచ్చని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2027 జూలై నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు.
రాష్ట్రంలో పెట్టబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా అడుగులు వేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విధితమే.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బుధవారం రాజధాని అమరావతిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేయాల్సిన అంశాలపై సైతం ఈ సమావేశం వేదికగా చర్చించనున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తున్నామని చెబుతూ రహదారుల నిర్మాణానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తొలి దశలొ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాగా పలు డిపార్టె మెంట్లకు సంబందించిన డిమాండ్స్‌పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు.