Home » CM Chandrababu Naidu
రాజధాని పనుల్లో కూటమి ప్రభుత్వం మరింత వేగం పెంచింది. అమరావతిలో రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కీలకమైన ఆర్థిక కేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అమరావతి విధ్వంసానికి గురైంది.
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు చకచకా రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా సోమవారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమావేశం... ఆ వెంటనే ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష...
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెటైర్లు కురిపించారు. జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన గొప్పలకు రూ.1300 కోట్లు ఖర్చు చేసిన దానికి సన్మానం చేయాలని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం 23 అంశాల ఎజెండాగా ఈ సమావేశం సాగింది.
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపనుంది.
కాకినాడ పోర్ట్ ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వార్త ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలాగే మంత్రి వర్గ ఉప సంఘం సైతం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీఎం చంద్రబాబు నాయడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాతోపాటు నామినేటేడ్ పోస్టుల భర్తీ అంశాలపై వీరి చర్చించారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.