Home » CM Chandrababu Naidu
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 18 నెలలుగా ప్రతి గంట, ప్రతి క్షణం కష్టపడ్డామన్నారు. 93 స్కీంలను మరలా రివైవ్ చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. గ్లోబల్ సమ్మిట్ 2025కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేదిక వృద్ధి, ఆవిష్కరణ, పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుందని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నంలో త్వరలో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖ అందాల్ని పెంచేందుకు తామెప్పుడూ కట్టుబడి ఉన్నామంటూ ఎక్స్ వేదికగా తెలిపారాయన.
ఏపీ పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్‌గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు.
ప్రతీ ఒక్కరి పనితీరుపైనా నాలుగైదు మార్గాల్లో కచ్చితమైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాంటి పదవులూ ఆలోచించకుండా నిస్వార్థంగా పనిచేస్తోందని ప్రస్తావించారు. అదే తరహాలో మన ఐడియాలజీ ప్రకారం పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు.
జగన్‌కు దేవుడన్నా లెక్కలేదని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని... ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని ధ్వజమెత్తారు. పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్తుగొలిపాయని చెప్పుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్‌ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు.
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.
తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.