Home » CM Revanth Reddy
‘‘ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నది.. వర్గీకరణను అడ్డుకుంటున్న మాలలను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే’’ అని ఎమ్మాఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలోనే ప్రజాస్వామ్య తెలంగాణను స్థాపిస్తామని, అందుకోసం విధి విధానాలను రూపొందిస్తున్నామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. తెలంగాణలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని ప్రజలు ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో బీసీ జనాభా గణనకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీల లెక్కలు తీసేందుకు బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ప్రజలు ప్రభుత్వ అధికారులను గుర్తు పెట్టుకుంటారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ అదికారులది కీలక పాత్ర అని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి , రూమ్ ఇచ్చామని కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని.. ఆయన్ను పక్కన పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలోదకాలు ఇచ్చేశారని బీజేపీ ఎంపీ ధర్మపూరి అర్వింద్ మండిపడ్డారు. ఏ హామీ అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి రేవంత్ రెడ్డి సర్కార్ ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పాదయాత్ర చేపడతానని ప్రకటించడంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఇది పాదయాత్రా లేకుంటే పదవుల యాత్రో స్పష్టం చేయాలని కేటీఆర్‌ను అర్వింద్ డిమాండ్ చేశారు.
‘‘అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే దేశంలో ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా రుణ మాఫీ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో అమలు చేశాం. రైతును రాజును చేశాం.
విశ్వ విద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి సారించాలని, విద్యార్థులను గమనించి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఇటీవల నియమితులైన వైస్ చాన్సలర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.