Home » CM Revanth Reddy
విశ్వ విద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి సారించాలని, విద్యార్థులను గమనించి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఇటీవల నియమితులైన వైస్ చాన్సలర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి నమ్మితే.. ఆ అంశాన్ని వివరిస్తూ పాదయాత్ర చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు.
హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖపు చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలతోపాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
రాష్ట్రంలోని గ్రామాల్లో సంక్రాంతిలోపు కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వస్తారని, డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే.. కొత్త సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్ మనసులో మాటను బయటపెట్టారు. మరోవైపు తెలంగాణలో బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి వాడపల్లికి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటెందన్నారు. ప్రస్తుతం సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. అసలు మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయన్నారు. ఈ నెల 6 లేదా 7 వ తేదిన కుల గణనపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ..
కాంగ్రెస్ వచ్చి ఏడాది అయినా ఒక్క ప్రాజెక్టు లేదని ఎంపీ అరవింద్ విమర్శించారు. పాదయాత్ర చేస్తే.. జనంతో కేటీఆర్ తన్నులు తింటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ దిగజార్చారని మండిపడ్డారు.పదేళ్లు కళ్లు నెత్తికి ఎక్కి పాలించారని ఎంపీ అరవింద్ ఆరోపించారు.
బీసీ కులగణనలో భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము న్యాయనిపుణులతో చర్చించి డ్రాఫ్ట్ రూపొందించామని తెలిపారు. ఆ చట్టంతో బీసీ కులగణనకు ఎలాంటి చిక్కులు రావు దాన్ని ప్రభుత్వానికి పంపుతామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.