Home » CM Revanth Reddy
‘‘ఓటు హక్కు పొందేందుకు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు ప్రస్తుతం 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఈ వయో పరిమితిని కుదించాలి.
‘‘సమాజం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు కుల గణన చేపట్టాం. జనాభా దామాషా ప్రకారం నిధులు అందాలంటే కుల గణన జరగాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కుల గణన జరగాలి.
లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రైతుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌పై దాడి చేయడం హేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ప్రభుత్వం బోగస్ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. లగచర్ల బాధితులను బాధితులను ఢిల్లీకి తీసుకెళ్తామని... నేషనల్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, సీఎం రేవంత్ రెడ్డి విచారణ కోరారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. సీఎం రేవంత్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎవనిదిరా కుట్ర? అంటూ పరుష పదజాలంతో చెలరేగిపోయారు.
నవంబర్ 14 నుంచి (బుధవారం) డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్బి స్టేడియంలో ప్రజా పాలన విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 26 రోజులపాటు ప్రజా పాలన విజయోత్సవాలు జరుగుతాయి.
శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ముంబైలోని వర్లీలో రోడ్‌షో నిర్వహించారు.
కొడంగల్ పరిధిలోని రైతుల భూములను లాక్కునే ప్రయత్నంలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి ప్రజల్లో అశాంతి రగిలిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ జయంతి(నవంబరు 14వ తేదీ) సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం నివాళులు అర్పించారు.