Home » CM Revanth Reddy
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.
బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులమని వేల కోట్లు కొల్లగొట్టారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారు అనుకున్నామని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని చెప్పడం విడ్దూరంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆయాచిత లబ్ధి జరిగిందని అన్నారు. అవుట్లకు, రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, క్రషర్లు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విపిరారు. రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల ఇష్యూ ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ లగచర్ల రైతులు ఏకంగా అధికారులపైనే దాడికి యత్నించడంతో తీవ్ర సంచలనం రేపింది.
రాష్ట్రంలో కొత్తగా రెండు నగరపాలక సంస్థలు(కార్పొరేషన్లు) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 12 నూతన మునిసిపాలిటీల ఏర్పాటుపైనా నిర్ణయం తీసుకుంది.
దేశంలో సాంకేతికంగా అధునాతన పరికరాలను తయారు చేయడం ద్వారా రక్షణ ఉత్పత్తుల్లో స్వాలంబన సాధించే దశను ప్రారంభించే సమయం వచ్చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి పెట్టించింది డొల్ల కేసు అనే విషయం హైకోర్టు ఉత్తర్వులతో తేటతెల్లమైందని.. మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు.