Home » CM Revanth Reddy
ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్‌లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాల్లో మోహరించి రైతులను అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఢిల్లీ నుంచి మహరాష్ట్రకు బయలుదేరి వెళతారు. బుధవారం మహరాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయే ఇప్పుడు వికారాబాద్ రైతన్నలపై పడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌పై ఉన్న కోపాన్ని రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై చూపారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది.
‘‘రైతులు ధాన్యం ఎమ్మెస్పీకి అమ్ముకోవటానికి రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 7,750 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. 80 లక్షల టన్నులు వచ్చినా, అంతకంటే ఎక్కువ ధాన్యం వచ్చినా కొనుగోలు చేయటానికి సరిపడా నిధులు సమకూర్చాం.
హిందూ, ముస్లిములు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరంతా అండగా ఉంటే.. విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతానని చెప్పారు.
ఇప్పుడు చదువుకున్న యువత, డాక్టర్లు, ఇంజినీర్లు సైతం డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, ఈ వ్యసనాలను ప్రోత్సహించే వారిని శిక్షించాలని ముఖ్యమంత్రిగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, అయినా సరిపోవడం లేదని, వీటి నిర్మూలనకు ఇక దైవ ఆశీర్వాదమే కావాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో జరిగే ‘అడ్డా’ కార్యక్రమంలో పాల్గొంటారు.
‘‘పది నెలల్లో తెలంగాణ ఏం కోల్పోయిందో తెలిసి వచ్చిందని నిన్న, మొన్న ఒక పెద్దాయన మాట్లాడుతున్నడు. ఏం కోల్పోయిందయా.. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.