Home » CM Siddaramaiah
ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అయినా తాను ప్రస్తుతం శానసభలో ప్రజా ప్రతినిధిగా స్థానం దక్కించుకున్నాని, భూ కుంభకోణంలో చిక్కుకున్న సిద్దరామయ్య జైలుకు వెళ్లడం ఖాయమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్(Gangavati MLA Gali Janardhan) రెడ్డి జోస్యం పలికారు.
ముడా వివాదంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కు కేసుల కష్టాలు బిగుసుకుంటున్న తరుణంలో మంత్రుల రహస్యభేటీ కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. కారణాలు ఏవైనా రహస్యంగా సమావేశం కావడం పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను విస్మయం కలిగిస్తోంది.
‘ముడా’ వ్యవహారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మెడకు చుట్టుకుంది. ఆయన భార్యే స్థలాలలు వద్దని వాపసు చేయడంతో ఆయన మరింత ఇరుక్కుపోయినట్లయ్యింది. ఇంటి స్థలాల వివాదం సీఎం సిద్దరామయ్య కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది.
ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. రెండోసారి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్కు వివాదాలు చుట్టుముడుతున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోంది. ‘ముడా’ అవినీతి కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)ను ప్రాసిక్యూషన్కు అనుమతులు ఇచ్చిన గవర్నర్పై మూకుమ్మడిగా నాయకులంతా తిరగబడ్డా ఈ మద్దతు ఎంతకాలమనేది చర్చలకు దారితీస్తోంది.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్కు అనుమతించిన గవర్నర్ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) వెల్లడించారు.
ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిఎం సిద్దూ అమాయకుడని ఈ సందర్భంగా శివకుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.
ఆగస్ట్ 29వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని ట్రయిల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తవర్చంద్ గెహ్లాత్ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలంటూ సీఎం సిద్దరామయ్య సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
మైసూరు అర్బన్ డెవలప్మెమంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాత్ ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సింగిల్ జడ్జి జస్టిస్ హేమంత్ చందనగౌండర్ ధర్మాసనం ఈ రోజు విచారించనుంది.