Home » CM Stalin
సోమవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై (Citizenship Amendment Act) ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిని తమ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమంటూ ఇప్పటికే ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు. తాజాగా సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం.. తమిళనాడులో (Tamil Nadu) ఈ చట్టాన్ని అమలు చేయబోమని అన్నారు.
డీఎంకే రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నట్టే రాష్ట్రంలో కుటుంబ పాలనే కొనసాగుతోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఉన్నత స్థితికి తెచ్చేందుకు తాపత్రయపడుతున్న పాలనే ద్రావిడ తరహా పాలన అని సీఎం స్టాలిన్(CM Stalin) అన్నారు.
తూత్తుకుడి జిల్లాలోని స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేసేందుకు వీలుగా కఠిన చట్టాన్ని తీసుకుని రావడంతో పాటు కోర్టులో జరిగిన న్యాయపోరాటంలో ప్రభుత్వం తరపున బలమైనవాదనలు వినిపించినందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin)కు పర్యావరణ నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు బీజేపీ వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. చైనా భాష 'మాండరిన్'లో ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై వివాదం చోటుచేసుకుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకుని చదివిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ఈ ఏడాది ప్రసంగ పాఠాన్ని క్లుప్తంగా చదివి, ఆపై ప్రభుత్వం, స్పీకర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేసి కూర్చుండిపోయారు.
లోక్‌సభ ఎన్నికల డీఎంకే(DMK) మేనిఫెస్టో తయారీకి ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్(CM Stalin) పిలుపునిచ్చారు.
స్థానిక టి.నగర్‌లోని కోదండరామాలయ అర్చకులు, సిబ్బంది ముఖాల్లో భయాందోళనలు కనిపించాయంటూ గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) తీవ్రంగా స్పందించారు.
పొంగల్ పండుగ సందర్భంగా రూ1,000 నగదుతో కూడిన కానుక పంపిణీని ఈనెల 10న బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రారంభించనున్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీఎం స్టాలిన్(CM Stalin) నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethi Reddy Jagadeeswara Reddy) ప్రకటించారు.
గత వారం రోజులుగా పొంగల్ నగదు కానుకపై కొనసాగిన సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. పొంగల్(Pongal) తయారీకి అవసరమైన సరుకులతోపాటు రూ.1000 నగదును కూడా రేషన్‌షాపుల్లోనే పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) శుక్రవారం ప్రకటించారు