Home » Congress Govt
‘‘పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతిపాలన శాపంగా మారింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.
రాష్ట్రంలోని గురుకులాలపట్ల సర్కారు నిర్లక్ష్యం.. అక్కడి విద్యార్థులకు శాపంగా మారిందని, తాజాగా నలుగురు విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురికావడం తనను కలచివేసిందని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
వరద బాధితుల సహాయార్థం రూ.18.69 కోట్ల సహాయాన్ని విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వానికి అందించారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ ఒక బేవకూఫ్ అని అన్నారు.
రాష్ట్రంలో గత రెండేళ్లలో పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. 2022 నుంచి పిడుగుపాటుకు గురై మృతి చెందిన 16 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున రూ.96 లక్షలను మంజూరు చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి (58) దారుణ హత్యకు గురయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) అల్టిమేటం జారీ చేసింది.
పార్లమెంట్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేదవారికి తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.
గ్రూప్-1 పరీక్షల విషయంలో బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేశారని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు.
రేవంత్ ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాలు రాష్ట్ర పురోగతికి గొడ్డలి పెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ చార్జీలను రూ.10నుంచి రూ.50కు పెంచాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇప్పటికే కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.