Home » Congress Govt
రేవంత్ ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాలు రాష్ట్ర పురోగతికి గొడ్డలి పెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ చార్జీలను రూ.10నుంచి రూ.50కు పెంచాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇప్పటికే కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
అనుభవం లేకనే తప్పులు మీద తప్పులు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ బురద జల్లడం మానుకోవాలని మంత్రి పొంగులేటి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంచి పాలనా దక్షిత ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.
హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్ 1 సమస్య , సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం నగరం ఘటనలతో భాగ్యనగరం అట్టుడుకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతు భరోసా విషయంలో పంట భూముల విషయంలో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
మూసీపై సీఎం రేవంత్ది గోబెల్స్ ప్రచారమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్లను రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదలకు పంచి ఇచ్చి గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఅర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చి నట్లుగా రేవంత్ రెడ్డి కూడా కట్టి ఇవ్వాలని కోరారు.
రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆందోళనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ధర్నాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయకుండా.. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వరంగల్ రైతు డిక్లరేషన్ మీటింగ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎక్కడ రాజీపడలేదని స్పష్టం చేశారు.
సీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవని ఎమ్మెల్సీ కోదండరాం దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్నిసార్లు అడిగిన వివరాలు ఇవ్వలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందని తెలిపారు.
అన్నివర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో దళితులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29పై అనవసర అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. కొంతమంది రాజకీయ నేతలు 33,383 మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న పనిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారని అన్నారు.