Home » Congress Govt
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి , రూమ్ ఇచ్చామని కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని.. ఆయన్ను పక్కన పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు 20000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పాలసీ కోసం విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న నిష్ణాతులను, అనుభవజ్ఞుల సలహాలతో ప్రణాళిక సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
కాంగ్రెస్ వచ్చి ఏడాది అయినా ఒక్క ప్రాజెక్టు లేదని ఎంపీ అరవింద్ విమర్శించారు. పాదయాత్ర చేస్తే.. జనంతో కేటీఆర్ తన్నులు తింటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ దిగజార్చారని మండిపడ్డారు.పదేళ్లు కళ్లు నెత్తికి ఎక్కి పాలించారని ఎంపీ అరవింద్ ఆరోపించారు.
బీసీ కులగణనలో భవిష్యత్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము న్యాయనిపుణులతో చర్చించి డ్రాఫ్ట్ రూపొందించామని తెలిపారు. ఆ చట్టంతో బీసీ కులగణనకు ఎలాంటి చిక్కులు రావు దాన్ని ప్రభుత్వానికి పంపుతామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.
దీపావళి వేళ.. తెలంగాణలోని విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై పునరాలోచన చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.
తనపై ఎవరు చెప్పారని పోలీసులు కేసులు నమోదు చేశారో చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం ప్రశ్నించొద్దని చెబితే కాంగ్రెస్ నేతలు జిల్లాలో ఏం చేసినా తాము నోరు తెరువమని అన్నారు. తాను కేసులు పెడితే భయపడే రకం కాదని చెప్పారు.
కాంగ్రెస్ పది నెలల పాలనే విసుగొస్తే బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఎలా భరించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు విశ్వసించరని విమర్శించారు. కేటీఆర్కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు.
డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుందని మంత్రి సీతక్క తెలిపారు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన సీఎం రేవంత్రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. ఇక హాస్టల్ విద్యార్థులు అర్థాకళితో అవస్థలు పడాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.