Home » Congress Govt
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో అన్ని బాధ్యతలకు రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చానని కవిత చెప్పుకొచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గూండాలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్ధీన్కు ఇద్దరు గన్మెన్లను ఎందుకు ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అవ్వా , తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
ఫీజు బకాయిలపై తెలంగాణ బీజేపీ నేతలు పోరుబాటకి సిద్ధమయ్యారు. లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలతో కలిసి నవంబర్ తొలి వారంలో ‘చలో హైదరాబాద్’ చేపట్టడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయమయ్యాయని మండిపడ్డారు.
సత్తుపల్లిలో బీసీ బంద్‌లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
బీసీ ర్యాలీలో ర్యాలీలో వి.హనుమంతరావు ఫ్లెక్సీ పట్టుకుని నడుస్తుండగా.. అది అడ్డువచ్చి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావును పైకి లేపారు.
అందరికీ విద్యా, ఉద్యోగం కల్పించాలని గొప్ప సామాజిక విప్లవం కోసం రాహుల్ గాంధీ మేనిఫెస్టో రూపొందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. కొద్ది తేడాతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు.