Home » Congress Vs BJP
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని బుల్డోజర్‌తో నేలమట్టం చేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూటమి పార్టీల అగ్రనేతలు నిప్పులు చెరిగారు. అయోధ్య నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు దేశంలో మత స్వేచ్ఛను కాపాడతామని స్పష్టం చేశారు.
తన పదాలను ప్రధాని నరేంద్ర మోదీ కాపీ కొట్టడాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఆయనతో ఏమైనా చెప్పించగలనని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. మోదీ నోట ఏ మాటలు వినకూడదని..
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకుడు గౌరవ్ వల్లభ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు (పీఏ)తో ఆ పార్టీ నడుస్తుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు.
మరికొద్ది రోజుల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ప్రకటనలో బిజీగా మారాయి. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలని భావిస్తున్న ఇండియా కూటమి ఓ వైపు.. మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ మరోవైపు పావులు కదుపుతున్నాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ఓ హెచ్చరిక జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన నేతల్లో చాలామంది బీజేపీలోకి (BJP) చేరుతారని పేర్కొన్నారు. కాబట్టి.. ఆ ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు.
రూ. 6 వేల కోట్లు విలువైన మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో బఘేల్ పేరును చేర్చారు.
సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. ఒకరిపై మరొకరు విమర్శలు - ప్రతివిమర్శలు, ఆరోపణలు - ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార బీజేపీపై (BJP) తారాస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వ్యవహారంపై బీజేపీపై (BJP) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. తమ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అందుకున్న ఎలక్టోరల్ బాండ్లను రాహుల్ తిరిగి ఇస్తారా? అని ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) వరుస దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్, కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి.. బీజేపీలోకి (BJP) చేరుతున్నారు. తమ నేతల్ని కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోతుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది.
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతున్న తరుణంలో.. రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే బీజేపీ (BJP) 195 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగా.. ఇండియా కూటమి (India Alliance) ఇంకా సీట్ల సర్దుబాటు విషయంపై చర్చలు జరుపుతోంది. అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈసారి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్‌గా మారింది.