Home » Congress
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
యువజన కాంగ్రెస్ ఎన్నికలో సింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆకునూరి అనంత కృష్ణారావు గా అత్యధిక మెజారిటీ తొ గెలుపొందారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా..
తెలంగాణ రాష్ట్రంలో మరో తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని ప్రజాపాలన కొనసాగి తీరుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు.
కాంగ్రెస్ సర్కారు పాలనలో తెలంగాణ పునర్వికాసం వైపు పయనిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తామన్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రొటోకాల్ విషయమై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్నతల్లిని చూసిన భావన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ అమ్మను చూసిన భావన కలిగేలా విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. పార్టీ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన చెప్పారు.
సభ ప్రారంభంకాగానే కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీటులో కూర్చున్నారు. విషయాన్ని గుర్తించిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని..
ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడంలేదన్నారు. దక్షిణ తెలంగాణకు పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ నియోజకవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన ఐడి కార్డును చూపిస్తూ.. ఈ కార్డుకు విలువలేకుండా పోయిందని..