Home » Congress
ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడంలేదన్నారు. దక్షిణ తెలంగాణకు పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ నియోజకవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన ఐడి కార్డును చూపిస్తూ.. ఈ కార్డుకు విలువలేకుండా పోయిందని..
హైదరాబాద్: డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2009, డిసెంబర్ 9న అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఒక ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెడుతున్నామని తెలిపారు. ఇది చరిత్రలో నిలిచిపోయిన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు.
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా సోమవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.
ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్‌షీట్ కాదని, దాన్ని రిప్రజంటేషన్‌గా తాము భావిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్ర క్యాబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంలో ఆంతర్యమేమిటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు.
ఏడాది కాంగ్రెస్ పాలనపై చార్జ్‌షీట్ వేసేంత నైతికత బీఆర్ఎస్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడగానే దళితుడినే సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి.. అవి చేయలేకపోయిన కేసీఆర్‌పై అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్ వేయలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ప్రజలు విసుగుచెంది ఏడాది కిందటే ఆ పార్టీకి ‘డిశ్చార్జి షీట్’ ఇచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించేది లేదని, ఆ విగ్రహాన్ని సచివాలయంలో కాకుండా కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
‘‘కాంగ్రెస్ ఏడాది పాలన అంతా ప్రజలను వంచించడమే సరిపోయింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు అందుకునే అవ్వ, తాతల వరకు.., నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరినీ వంచించింది.
తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఇదొక మూర్ఖపు చర్య అని అన్నారు.