Home » Congress
లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూ సేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం సరికాదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఢిల్లీ నుంచి మహరాష్ట్రకు బయలుదేరి వెళతారు. బుధవారం మహరాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు జతకట్టారని, అంతర్గతంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, తూకాల కోసం రైతులు ప్రాధేయ పడాల్సిన పరిస్థితి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ఐదేళ్ల కోసం తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తి ప్రజాభీష్టానికి విరుద్ధంగా పార్టీ మారితే వారు ఏం చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్షాలను అణచేయడం.. ఇవే ప్రధాని మోదీకి తెలుసంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చాలా దయనీయంగా ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు ఆ పార్టీని ఎవరూ నమ్మరని చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్ వాగ్దానాలు చేయడమే కానీ అమలులో మాత్రం విపలమైందన్నారు. నాగపూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనను ఆరోసారి గెలిచిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలను మేము ఓటర్లుగా చూడటంలేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ఫై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
మహారాష్ట్రలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమి సమస్త బలగాలను మోహరించి గెలుపుకోసం శ్రమిస్తున్నాయి.