Home » Congress
దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలను మేము ఓటర్లుగా చూడటంలేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ఫై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
మహారాష్ట్రలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమి సమస్త బలగాలను మోహరించి గెలుపుకోసం శ్రమిస్తున్నాయి.
రాష్ట్రంలో మంత్రులపై వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు వస్తుండడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజ్యాంగం రెడ్‌బుక్‌ని అర్బన్ నక్సలిజంతో పోలుస్తారా... అంటూ ప్రధాని మోదీ, బీజేపీలను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విడగొట్టి వారి రిజర్వేషన్లను లాక్కోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
అహ్మద్ భార్య, కుమారుడు కూడా ఇటీవల ఆప్‌లో చేరారు. అక్టోబర్ 29న అహ్మద్ కుమారుడు చౌదరి జుబీర్ అహ్మద్, ఆయన కౌన్సిలర్ భార్య షాగుఫ్తా చౌదరి ఆప్‌లో చేరారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అహ్మద్ కుటుంబం పార్టీ మారడం కాంగ్రెస్‌కు మింగుడపడటం లేదని తెలుస్తోంది.
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు ప్రచార కార్యక్రమాలను మరింత ఉధృతం చేశాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. ఇవాళ ఉదయం బీజేపీ సారధ్యంలోని కూటమి మేనిఫెస్టో విడుదల చేయగా.. కొద్దిసేపటికే ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA) కూడా మేనిఫెస్టోని ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో ఈ కమిటీ సమావేశమై విజయోత్సవ ఉత్సవాలపై చర్చించింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయానికి రానున్నారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఆలయం గుట్టపై రూ. 110 కోట్లతో మంజూరైన ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి భూమి చేస్తారు.