Home » Congress
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయానికి రానున్నారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఆలయం గుట్టపై రూ. 110 కోట్లతో మంజూరైన ఎలివేటెడ్ కారిడార్తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి భూమి చేస్తారు.
దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడం, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన పరిమితులను ఎత్తివేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.
Telangana Ex CM KCR: చాలా గ్యాప్ తరువాత ప్రజల మధ్యకు వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. సిద్దిపేటలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్..
ఆడవారిలాగా ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారని జేడీఎస్ నేత దేవెగౌడ కుటుంబీకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ(Congress MLA Balakrishna) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నపట్టణ నియోజకవర్గం చక్కెర గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏడ్చేవారిని ఎవరైనా నమ్ముతారా..? అన్నారు.
భారతీయ సమాజాన్ని కులాల పేరిట చీల్చాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఒక కులాన్ని మరో కులంపైకి ఉసిగొల్పుతూ ప్రమాదకర క్రీడ ఆడుతోందని మండిపడ్డారు.
పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించి తుది నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే ఉంటుందని, ఆలోపే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నా కమ్యూనిస్ట్లు తమతో కలిసి వచ్చారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుంటే తనకు జన్మనే లేదని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెలు పెద్ద స్కామని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నాలుగేళ్లలో బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపెడతామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వార్నింగ్ ఇచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహా కావద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుందని ఆరోపణలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు(Former MP V. Hanumantha Rao) అన్నారు.