Home » Congress
అంబేడ్కర్, సమానత్వం అనేవి ఆయన (అమిత్‌షా) ఆలోచనల్లో కూడా లేవని, ఆయన సిద్ధాంతం, భావజాలం నుంచి ఇవి కనుమరుగయ్యాయని ప్రియాంక్ ఖర్గే విమర్శించారు.
దేశంలోని అన్ని జిల్లాల్లోనూ 'బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్' నిర్వహించాలని కోరుతూ పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసీ వేణుగోపాల్ ఒక సర్క్యులర్ జారీ చేశారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.
నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదాం హరీష్‌రావు, కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా.. వాళ్ల నాన్న కట్టిండా అని నిలదీశారు.
‘నేనేమైనా ఉగ్రవాదినా..’ రెండు దశాబ్దాల రాజకీయంలో వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు, సంస్థాగతంగా రాజకీయంగా మాత్రమే మాట్లాడుతా... అటువంటిది నన్ను టార్గెట్ చేసి చిత్రహింసలకు గురి చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చెయ్యాలని కాంగ్రెస్, వామపక్ష సంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
‘‘రాహుల్‌గాంధీ ప్రతి రోజూ ఇంట్లో దేవుడికి మొక్కినా.. ఫొటోలు తీయించుకుని ప్రచారం చేసుకోరు. మోదీ, అమిత్‌షాలు మాత్రం దేవుడిని మొక్కినప్పుడు ఫొటోలు తీయించుకుని మరీ ప్రచారం చేసుకుంటారు.
ఫార్ములా-ఈ కేసులో జైలుకు వెళితే యోగా చేసుకుంటానన్న కేటీఆర్.. ఇప్పుడెందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టులకు వెళితే తప్పు పట్టిన ఆయనే.. ఇప్పుడు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా-ఈ రేసు కేసును ముందుకు తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాపలాకుక్కలా కాపాడుతానని చెప్పుకొన్న కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు.. వేటకుక్కల్లా ప్రజల సొమ్మును కొల్లగొట్టారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.