Home » Court
కోటిపల్లి నరసాపురం రైల్వేలైన్ అలైన్మెంట్ సర్వేకు మార్గం సుగమమైంది. రైల్వేలైన్ రీ అలైన్మెంట్, భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో ఇప్పటి వరకు ఉన్న స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది.
విజయవాడలో వరదల కారణంగా ప్రాణనష్టం జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
వైసీపీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండు సార్లు స్టేషన్ కి రావాలంటూ షరతులు పెట్టింది. అయితే, వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో..
సివిల్ వివాదాల పరిష్కారంలో తీసుకోవాల్సిన విధి విధానాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు.
అక్రమమైనింగ్‌కు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలిగించి న వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముం దస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం వెలువరించారు.
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడైన సీనియర్ ఐపీఎస్ అధికారి పీసర్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
సైనేడ్ ఉపయోగించి పది హత్యలు చేసిన నిందితులకు జీవిత కారాగార శిక్ష, జరిమానాలను విజయవాడ న్యాయస్థానం విధించింది. 2019వ సంవత్సరంలో ఏలూరులో కాటి నాగరాజు అనుమానాస్పద మృతిపై 174 సీఆర్‌పీసీ కేసుగా నమోదైంది.
గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని సుదీర్ఘ విరామం తర్వాత కనిపించారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని వచ్చారు.