Home » CPI
అమూల్ పాల రైతులకు న్యాయం చేయాలని సీపీఐ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్ చేసారు. శనివారం పాల రైతులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి సంస్థను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ.15వేల కోట్లను గ్రాంట్‌గా మార్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15వేల కోట్లు ఇప్పించినట్లు కేంద్రం ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొనే శక్తి చంద్రబాబుకు ఉందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగిన తెలంగాణకు మాత్రం తీవ్రమైన అన్యాయం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.
విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కామెంట్స్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడానికే పరిమితమయ్యారని, ప్రధాని మోదీ పదేళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని.. ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కంట్రోల్ కమిటీ చైర్మన్, కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ (75) వ్యక్తిగత కారణాలతో ఖమ్మంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
పేద, బడుగు, బలహీనవర్గాల తరపున భూ పోరాటాలు చేసిన గొప్ప యోధుడు వెంగమనాయుడని సీపీఐ నాయకులు కొనియాడారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన వెంగమనాయుడు 27వ వర్ధంతిని నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) లేఖ రాశారు. అమెరికా అట్లాంటాలో వరంగల్‌కి చెందిన వెన్నెల అనే అమ్మాయి రోడ్డు ఆక్సిడెంట్లో తీవ్రగాయాలై హాస్పటల్ ఉందని తెలిపారు.
రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ కావడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.