Home » Cricket news
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ లెజెండ్ మైకేల్ క్లార్క్ కేన్సర్ బారిన పడ్డాడు. అతడికి స్కిన్ కేన్సర్ సోకినట్టు తెలిపాడు. స్కిన్ కేన్సర్ కారణంగా మరో సర్జరీ చేయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా క్లార్క్ 2004-2015 మధ్య కాలంలో కీలకంగా వ్యవహరించాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియ షెపర్డ్ అద్భుతం చేసి చూపించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున ఆడుతూ అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్నాడు.
221 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 187 వికెట్లు తీశాడు. ఆయన చెన్నై, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు ఆసియా కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కే అవకాశం లేదా? ఇంగ్లండ్ పర్యటనలో అమోఘంగా రాణించి పలు రికార్డులు నెలకొల్పిన గిల్‌ను పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది.
ఉత్కంఠ భరిత ఆసియా టోర్నీకి సంబంధించి భారత్‌లో ప్రసార హక్కులు దక్కించుకున్న సోనీ టీవీ తాజాగా ప్రకటన రేట్ల వివరాలు విడుదల చేసింది. ఈ మ్యాచులకున్న డిమాండ్‌కు అద్దంపట్టేలా ప్రకటన రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడి నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జాహన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. షమీని స్త్రీలోలుడిగా అభివర్ణించారు. ప్రియురాళ్ల పిల్లలను మంచి స్కూళ్లలో చదివస్తూ, కన్నకూతురి చదువును మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై అభిమానులే కాదు.. ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వెస్టిండీస్ చేతిలో పాకిస్థాన్ దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. మూడో వన్డేలో 200 పైచిలుకు పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ ఘోరంగా విఫలమయ్యారు.
దాదాపు 34 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను గెలుపొంది వెస్టిండీస్ టీమ్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విండీస్ టీమ్ 2-1 తేడాతో పాకిస్థాన్ జట్టుపై గెలుపొందింది. బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. 25 సంవత్సరాల అర్జున్‌కు బుధవారం (ఆగస్టు 13) ఎంగేజ్‌మెంట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
ధోనీని తమిళ అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు. ధోనీని పసుపు రంగు జెర్సీలో చూసి మురిసిపోతారు. ధోనీ ఎప్పటికీ ఐపీఎల్ ఆడుతూనే ఉండాలని కోరుకుంటారు. అయితే మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ వచ్చే సీజన్ ఆడతాడో, లేదో ఇంకా క్లారిటీ లేదు.