Home » Cricket
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్ ఆరంభం నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. తన సెంచరీ కోసం సహచర బ్యాటర్ విరిగిన చేతితోనే క్రీజులోకి వచ్చాడని.. అతడి త్యాగం వల్లే తనకు భారత జట్టులో చోటు దక్కిందని వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. బుమ్రాపై సరదా వ్యాఖ్యలు చేశారు. తనతో రీల్ చేయాలంటే బుమ్రా ఇంకా ఎక్కువ వికెట్లు పడగొట్టాలని తెలిపాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ బుమ్రా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 దగ్గర పడుతున్న సమయంలో టీమిండియా సన్నాహక పోరు ప్రారంభించింది. తుది జట్టులో వికెట్ కీపింగ్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ పోటీ పడుతున్నారు. సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలిచిన తర్వాత సంజూపై జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్ రూ.2కోట్లకు ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా రోహిత్ శర్మతో తనకున్న అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకున్నాడు.
కటక్ వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య మరికొన్ని గంటల్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ బుమ్రా మరో ఒక్క వికెట్ తీస్తే.. ఈ ఫార్మాట్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.
ఐపీఎల్ 2026 వేలానికి సంబంధించిన తుది జాబితా పేర్లను బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 1355 మంది అప్లై చేసుకోగా.. 1005 మందిని తొలగించి, 350 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. కాగా మెగా వేలం డిసెంబర్ 16న జరగనుంది.
ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఓపెనింగ్ చేస్తున్న వారితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలని.. తాము కొన్ని సార్లు మాట్లాడుకోలేదని తెలిపాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం వన్డే క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తాజాగా, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రో-కోపై ప్రశంసలు కురిపించాడు.
భారత్-సౌతాఫ్రికా మధ్య నేటి నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సఫారీల కెప్టెన్ మార్క్రమ్ అభిషేక్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ వికెట్ కీలకంగా మారనుందని తెలిపాడు.