Home » Cricket
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌పై రవిశాస్త్రి స్పందించాడు. ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేయడం తగదని, ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఓటమికి కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వన్డే మహిళల వరల్డ్ కప్ 2025లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్‌కు ఢిల్లీ ప్రభుత్వం రూ.1.5 కోట్ల రివార్డ్ ప్రకటించింది. గాయం కారణంగా సెమీఫైనల్‌కు దూరమైనా, లీగ్‌లో 305 పరుగులతో మెరిసిన ఆమెకు జైషా ద్వారా విన్నింగ్ మెడల్ కూడా దక్కింది.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. వన్డే, టెస్ట్, టీ20ల్లో మళ్లీ ఆడాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు. ఆయనపై గతంలో హత్య కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన రీల్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక్క రోజులోనే ఈ రీల్ 10 కోట్ల వ్యూస్ అందుకోవడం విశేషం.
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయింది. ఈ మేరకు ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని అందరినీ రిక్వెస్ట్ చేసింది.
సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. యశస్వి జైస్వాల్ కేక్ తినిపించడానికి రోహిత్ దగ్గరికి వెళ్లగా.. సున్నితంగా తిరస్కరించాడు. ఆ సందర్భంగా రోహిత్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచాక కోహ్లీ-అర్ష్‌దీప్ సింగ్ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సౌతాఫ్రికాపై టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. సిరీస్ మొత్తంలో టాస్ గెలిచినప్పుడే ఎంతో ఆనందంగా ఫీలయ్యానని తెలిపాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా సొంతగడ్డపై వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఐపీఎల్ ఢిల్లీ క్యాపిట్సల్ సహ యజమాని.. కోచింగ్ సిబ్బందిపై విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టాడు. దానికి గంభీర్ ఇప్పుడు ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు.