Home » Cricket
చెన్నైలో క్యాంపునకు రావాలని ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను బీసీసీఐ ఆహ్వానించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ రవిచంద్రమఅశ్విన్ తరహాలో ఉంటుంది.
అయితే చెప్పుకోవడానికి ఇంత గ్రాండ్‌గా అనిపిస్తున్నప్పటికీ గడిచిన సీజన్-2024లో ఐపీఎల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ వ్యాల్యూ భారీగా పడిపోయింది. ఐపీఎల్ 2023లో సీజన్ ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ 11.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది సీజన్లో ఏకంగా 9.9 బిలియన్ డాలర్ల స్థాయికి క్షీణించింది.
ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్. తండ్రికి తగ్గట్టే తనయుడు కూడా క్రికెట్లో రాణిస్తున్నాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తో సత్తా చాటుతున్నాడు. సమిత్‌ను ఆల్ రౌండర్ అనడం బెటర్. కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్‌ల్లో ఆడి, ఆ జట్టుకు విజయాలు అందజేశాడు. ప్రస్తుతం మైసూర్ వారియర్స్ తరఫున కేఎస్‌సీఏ మహారాజా టీ 20 ట్రోఫీలో ఆడుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) క్రికెట్ పోటీల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తానా టి7 కిడ్స్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది.
జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడనుంది. ఆ పదవి రోహన్ జైట్లీకి దక్కే అవకాశం ఉంది. రోహన్ జైట్లీ దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
Maharaja T20 Trophy: మహారాజా టీ20 ట్రోఫీలో బౌలర్ అభిషేక్ ప్రభాకర్ అదరగొట్టాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి తన టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ అద్భుత ప్రదర్శనతో గుర్బర్గ్ టీమ్ మహారాజా టీ20 ట్రోఫీలో 4 మ్యాచ్‌లు గెలిచింది.
క్రికెట్లో కొన్ని షాట్లను కొంతమంది మాత్రమే ఆడగలరు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఇటీవల కాలంలో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మల గురించి అందరికీ తెలుసు.. ఈ ముగ్గురిది ఎవరి స్టైల్ వారిదే. కానీ ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్ దీప్తిశర్మ వార్తల్లో నిలిచింది
పాలబుగ్గల పసివాడిగా క్రీజులో అడుగుపెట్టి.. మొనగాళ్లలాంటి బౌలర్ల పనిపట్టి.. రికార్డులను కొల్లగొట్టి.. చరిత్రలో తనకెవరూ సాటిలేరని చాటిన మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే.
శ్రీలంకతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు పూర్తయ్యాయి. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం చేజార్చుకుంది. ఆగస్టు 7తో మూడు మ్యా్చ్‌ల వన్డే సిరీస్ పూర్తయ్యింది.