Home » Cricket
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమానాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ముక్కోణపు సిరీస్‌లో అంపైర్లతో వాగ్వాదం కారణంగా.. అతడి ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలిసారిగా ఇన్‌స్టా పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో ఆమె వేలికి ఉంగరం లేకపోవడం చర్చకు దారి తీసింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్‌ను వదిలి సీఎస్కే నుంచి జడేజాను జట్టులోకి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్ఆర్ కెప్టెన్ ఎవరనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ విషయంపై మాట్లాడాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు టీమిండియా స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ నామినేట్ అయింది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షఫాలీ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
కటక్ వేదికగా డిసెంబర్ 9 నుంచి టీమిండియా-సౌతాఫ్రికా జట్లు ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు టికెట్ల కోసం కౌంటర్ల దగ్గర ఎగబడ్డారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ చాలా తక్కువ టికెట్లు మాత్రమే విక్రయానికి ఉంచిందనే ఆరోపణలు వస్తున్నాయి.
రో-కోకి హెడ్ కోచ్ గంభీర్‌కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ నిలకడ ప్రదర్శనపై సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ స్పందించాడు.
కేకేఆర్ డేంజరస్ బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై రస్సెల్ తొలిసారిగా స్పందించాడు. ఐపీఎల్‌లో ఫేడౌట్ అవ్వకముందే రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
విశాఖపట్టణంలోగల ఏసీఏ వీడీసీఏ స్టేడియం... భారత్‌కు విజయాల వేదికగా మారుతోంది. ఈ స్టేడియంలో మ్యాచ్ జరిగితే.. ఇక విజయం భారత్‌దేనని క్రికెట్ అభిమానులు అంటుంటారు. మొత్తం పది అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు జరిగితే అందులో ఏడు భారత్ గెలవడం విశేషం.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ ఓడింది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది.