Home » Crime News
రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరి హైదరాబాద్ సహా మరో నాలుగు జిల్లాల్లో దందా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నగరాన్ని సూరి గ్యాంగ్ అడ్డాగా మార్చుకున్నట్లు తెలిపారు.
ఓ మహిళ అనూహ్యంగా మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా..
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు పట్టపగలు, నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపాడు. కొన్ని రోజులుగా ఆ బాలికను జతిన్ అనే దుండగుడు వెంబడిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని వెంబడిస్తున్నాడు.
గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారుజామున పారిపోతున్న వాళ్లపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
నవ మాసాలు మోసి.. కనీపెంచి పోషించిన తల్లికి అండగా ఉండాల్సిన ఆ కుమారుడు విచక్షణ మరిచిపోయాడు. మద్యానికి బానిసై కన్నబంధాన్ని మరిచి దారుణంగా తల్లినే హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో జరిగింది.
తనను, పిల్లల్ని చూసుకోవడం లేదని, అలాగే తనకు ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వడం లేదని ఓ భార్య, భర్తను కిడ్నాప్ చేయించింది. సుమారు పది మందితో కలిసి భర్త కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..
‘నా భర్తను మా అత్త, బావ చంపేశారు. పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు’ అంటూ బాధితురాలు హేమలత ఎస్పీ సుబ్బరాయుడు ఎదుట సోమవారం పీజీఆర్ఎస్లో మొర పెట్టుకున్నారు. ‘మాది వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌పురం. సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన కృష్ణకుమార్‌తో 2023లో నాకు వివాహమైంది. నా భర్తకు అన్న కిరణ్‌కుమార్, సోదరి అశ్విని ఉన్నారు.
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పోరేషన్ పరిధిలోని ఇందిరా నెహ్రూనగర్‌లో నివాసముండే నగేష్ గౌడ్ కుమారుడు సాయి నిఖిల్‌గౌడ్(21) బీటెక్ చదువుకుంటూ వనస్థలిపురంలో చెస్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నాడు.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు వారిని పొడిచి.. పొడిచి.. చంపేశారు. నిందితుల, హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాచారం పారిశ్రామికవాడలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హత్యకు గురుయ్యాడు.