Home » Crime
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కోత్వాలీ కాయమ్గంజ్ ప్రాంతంలోని భగౌతిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఇద్దరు బాలికలు జన్మాష్టమి సందర్భంగా గుడికి బయలుదేరినట్టు తెలుస్తోంది.
గుజరాత్ అడ్డాగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ఆటను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కట్టించారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు.. 36 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.
భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు ఓ భర్త చేసిన పని.. చివరికి అతడినే దోషిని చేసింది. ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చినందుకు అతడికి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది.
ఆమె వయసు 30.. చోరీ కేసులు 34.. ఇప్పటికే 10 సార్లు జైలుకెళ్లి వచ్చింది.. అయినా మార్పు రాలేదు.. చోరీలు కొనసాగిస్తోంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధులే టార్గెట్...! వారిని మచ్చిక చేసుకుని దగ్గరవుతుంది.
విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.
మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.
ఆస్తి కోసం ఓ కుమార్తె తండ్రినే పొట్టనపెట్టుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మాదాపూర్‌లో మరో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సోసైటీ 100ఫీట్ రోడ్లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను భారీగా మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను నగర పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరస దొంగతనాలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన కేటుగాటు నెహామియా అలియాస్ బ్రూస్లీని చివరికి కటకటాల వెనక్కి నెట్టారు.
జల్సాలకు అలవాటుపడి ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన నిందితుడు వెంకటేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసు దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బయటకొచ్చాయి. ఎస్పీ నర్సింహ కిశోర్ కేసు వివరాలను వెల్లడించారు.