Home » Crime
రాష్ట్రంలో ఇసుక అక్రమార్కుల దందా ఆగడం లేదు. ఇసుక తరలించే వాహనదారులతో మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఇటీవలే సమావేశమయ్యారు.
అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లుక్ ఔట్ నోటీసులపై ఏపీ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేమని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ చెప్పారు. వంశీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు.
నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్‌పై ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు శుక్రవారం దాడి చేశారు. అదే పాఠశాల హాస్టల్లో ఉంటున్న తమ చిన్నారులపై ఆయన కొన్నాళ్లుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆయనపై ఈ తరహా ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆంజనేయులు గౌడ్ వయసు 77 ఏళ్లు. విద్యాసంస్థల నిర్వహణతోపాటు సాహితీ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన నగరవాసులకు సుపరిచితులు. ఆయనపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న టూటౌన పోలీసులు వెంటనే పాఠశాలకు వెళ్లారు. నాలుగు, ఐదో ...
ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు గంజాయి కేసులో వికారాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వెల్దుర్తి మండలం గొటిపాళ్ల వద్ద అటవీశాఖ ఉద్యోగులపై పంగోలిన్ స్మగ్లర్లు రాళ్ల దాడికి తెగబడ్డారు. దాడిలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రగాయాలు అయ్యాయి. ముందస్తు సమాచారం మేరకు పంగోలిన్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాపై అటవీశాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే వీరి నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు.
విడాకులు తీసుకున్న మహిళలు, ఒంటరి వితంతువులే లక్ష్యంగా మ్యాట్రిమోని వెబ్సైట్లో అతను వివరాలు పెడతాడు. ఎవరైనా ఆకర్షితులైతే స్నేహం చేసి పెళ్లి చేసుకుంటాడు.
క్రిమినల్ చట్టాలను ప్రభుత్వాలు కట్టుదిట్టం చేస్తున్నా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారంనాడు ఇదే తరహా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక టీనేజ్ అమ్మాయిపై బిల్డర్ చేయి చేసుకున్నాడు. ఒళ్లు తెలియని ఆవేశంతో ఆమె చెంప పగడకొట్టడంతో ఒక్కసారిగా ఆమె బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయింది.
మన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఓ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అశ్లీల వీడియోలకు అలవాటుపడ్డ ఓ మైనర్ బాలుడు.. తన సొంత చెల్లిపైనే అత్యాచారానికి..
తన స్నేహితురాలికి దూరంగా ఉండాలన్న పాపానికి ఓ అమ్మాయిని దారుణంగా హత్య చేశాడో నీచుడు. అర్ధరాత్రి పీజీ హాస్టల్లోకి చొరబడి బతిమిలాడిన వినకుండా యువతి మెడపై కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు.
ఆఫ్రికాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారిటానియా సముద్రతీరంలో ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో 150 మంది గల్లంతు అయ్యారు. ఈ విషయాన్ని..