Home » Crime
కామారెడ్డి జిల్లా: పల్వంచ మండలం, భవానిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైబర్ కేటుగాళ్లు వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. అమెరికాలో ఉంటున్న మీ కుమార్తె మాధవి ఆపదలో ఉందని.. బెదిరింపు కాల్ చేశారు. ఆమె ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందంటూ ఈ కేసు నుంచి మీ కూతురును తప్పించాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, డబ్బులు పంపాలంటూ ఫోన్ చేశారు.
కొన్ని ప్రేమకథలు సుఖాంతంగా ముగిస్తే.. మరికొన్ని మాత్రం తీవ్ర విషాదంతో ముగుస్తుంటాయి. హత్యలు చేసేదాకా వ్యవహారాలు వెళ్తుంటాయి. చివరికి.. అడ్డుగా ఉన్నారని సొంత మనుషుల్ని సైతం...
నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ జరిగిన కేసును ఛేదించినట్లు రాజేంద్రనగర్(Rajendranagar) డీసీపీ శ్రీనివాస్(DCP Srinivas) వెల్లడించారు. ఈనెల 9న బాధితుడు కుటుంబంతో సహా వ్యక్తిగత పని నిమిత్తం విజయవాడకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు 24గంటల్లోనే కేసు ఛేదించి సొత్తును బాధితులకు అప్పగించారు.
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజమే. చిన్న చిన్న విషయాలకు కూడా విభేదాలు తలెత్తుతుంటాయి. కొందరేమో అప్పటికప్పుడే ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కానీ..
ఆర్థిక ఇబ్బందులు... అప్పుల బాధలు... లోన్ యాప్ వేధింపులను ఆసరాగా చేసుకుని కిడ్నీ రాకెట్ ముఠా ఓ నిరుపేద యువకుడిని మోసం చేసింది. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి..
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలికను హత్యచేసిన నిందితుడ్ని వదిలిపెట్టేది లేదని హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను శనివారం దారుణంగా హత్య చేసిన నిందితుడు బోడా బత్తుల సురేశ్ (26) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిన్నారు.
జాతీయ రహదారులపై ఆగి ఉన్న వాహనాల్లోని వాహనదారులపై రాళ్లతో దాడి చేసి చోరీలకు పాల్పడుతూ, ప్రతిఘటించిన వారి ప్రాణాలు తీస్తున్న పార్దీ గ్యాంగ్ అనే దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ఒకప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు దైవంగా భావించేవారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు బాట వేసి, జీవితాలకు ఒక రూపం కల్పిస్తారు కాబట్టి.. వారిని ఎంతో గౌరవించేవారు. కానీ..